STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Romance Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Romance Action Inspirational

కవితా పూరణం 13 . 02 . 22 కవీశ్వర్

కవితా పూరణం 13 . 02 . 22 కవీశ్వర్

1 min
273

కవితా పూరణం 13 . 02 . 22 కవీశ్వర్ .

దత్త పాదం :

"దారము జూడనెంతురె సదా మన దారలు మల్లె ముంగిటన్"

పూరణం : 

ధారా తలమునం దె ల్లప్పుడు ఉపవనమునందేకుం 

దరదనలు వికసితమై పరిమళ శోభ విలసిల్ల ఉల్లమం 

దెల్లప్పుడు రంజిల్లునట్లు దారముతో పూలల్లుతూ నం 

దారము జూడనెంతురె సదా మన దారలు మల్లె ముంగిటన్  

భావంఈ భూ తలమునందు గల ఉపవనము (గార్డెన్ )లో మల్లెపువ్వులు

వికసించిన పిమ్మట సువాసనల శోభ , మన మనస్సులలో ఎప్పుడు

రంజిల్లజేయు నట్లుగా మంచి దారముతో పూలల్లుతూ అందులోని దారమును 

మన పడతులు ఆ మల్లె ముంగిట చూడనెంతురే ఎల్లప్పుడూ .... అంటే

ఆ దారమును పట్టించుకోరు కానీ పరిమళ మల్లె సొగసు, గుబాళింపునే ఎక్కువగా 

వారు పట్టించుకుని ఇష్ట పడుతారు అని దీని భావం .


వ్యాఖ్య : "మల్లెల కాలం లో - మల్లివిరిసింది - పరిమళపు జల్లు కురిసింది."  


Rate this content
Log in

Similar telugu poem from Romance