కవితా గీతం
కవితా గీతం


ఆలోచనల కే నడకలు వస్తే , మన మెదడులో పదాలౌతాయి.
ఆ పదాలే మన చేతి ముని వేళ్ళ లో , అందమైన అక్షరాలౌతాయి .
ఆ అక్షరాలే మన కన్నులలోనికి వెళ్లి , మధురమైన భావాలౌతాయి .
ఆ మధుర భావాలే మదిలోకి వెళ్లి , మృదుమధుర తలపులౌతాయి .
ఆ తలపులే ఊహల ప్రపంచం లో , హరివిల్లు లాంటి చిత్రాలౌతాయి .
ఆ రంగుల చిత్రాల కాన్వాసులపై , నవ్య అందమైన ఆవిష్కరణాలౌతాయి .
ఆ ఆవిష్కరణలే నిపుణత లతో , భవ్యమైన కావ్య కన్యకాలౌతాయి .
ఆ కావ్యకన్యకల సుందర ఆకృతులతో , దివ్యమైన రచనలౌతాయి .
ఆ దివ్య రచనలే పాఠకుల లో , చెల రేగిన మధుర స్మృతులౌతాయి.
ఆ మధుర జీవన స్మృతు లలో , ఓలలాడే రచనానుబంధ బాంధవ్యాలౌతాయి.
********