STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Others

3  

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Others

కవిత...

కవిత...

1 min
233


మనసులో ఉన్నది..

పెదవులతో పలుకలేనపుడు

అది చెప్పటానికి మానవునికున్న..

ఆయుధం...చేతి రాత!

అది ఎదను తాకితే.....కవిత!


మనిషికి తట్టిన ఆలోచన...

ఆశగా మారి

దానికై 

తపించి...మదించి..

తన్మయత్వంలో..

తన్నుకు వచ్చేదే...కవిత!


ఒకపుడు...

కవిత్వం..


పరమాత్ముడు ను

పూజించేందుకు..

దేవతలను...

కొనియాడేందుకు

రాజులను...

పొగిడేందుకు


పండితులు వారి పాండిత్యాన్ని వాడి

తద్వారా ప్రభువుల యొక్క...

కనక కటాక్షములు పొందేవారు.


పురాణేతిహాస చరిత్రలో

పాండిత్యములన్నీ...

పండితులు..ప్రభువులకే తప్ప..

పామరులకు అర్ధమయ్యేది కాదు!


పామురలకు సైతం అర్ధమయ్యే పాండిత్యానికి

పునాది వేసింది వేమన..

తన శతకాల ద్వారా!


అలా శతాబ్దాల అనంతరం...

ఆరంభమైన సహజ పాండిత్యం..

ప్రజలు పడే కష్టాలను..

సమాజంలో ఉండే రుగ్మతలను

అణిచివేతకు గురైన దీనుల


యదార్ధ గాథలను చూచి

చలించి విరించబడినవే...

నిజమైన కవితలు!


కవిత్వం అంటే..

పాండిత్యం కాదు..

పరమార్థాలతో కూడిన..

సాహిత్యం కాదు


కవిత్వం అంటే..

మానవత్వం!


మానవత్వాన్ని..

పండితుల నుండి పామరుల వరకు

మేధావుల నుండి మంద బుద్దిగల వారి వరకు

ధనికుల నుండి పేదవారి వరకు


అందరిలోనూ నింపుకునేలా

ఆలోచింపజేసేదే...కవిత్వం!

ఆ కవితే..పొందుతుంది...

అమరత్వం!


       ......రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Classics