STORYMIRROR

Dinakar Reddy

Abstract Action Inspirational

4  

Dinakar Reddy

Abstract Action Inspirational

కథకు నాయకుడు

కథకు నాయకుడు

1 min
392

కంటి చూపులు

చావు చిరునామాను చూసినా

బుల్లెట్ల శబ్దం 

కిలకిలారావాలకు మారుగా మ్రోగినా


మంచు దిబ్బల కింద 

మాటు వేసిన చోట

రక్తం గడ్డ కట్టేలా చలి కొరికినా


ఎడారి ఇసుక

ఒంటితో సహవాసం చేసినా


ఒకే లక్ష్యంతో

అడుగు ముందుకు వేసే ఓ సైనికుడా

నీకు వందనం


చిత్రమైన భారత నవతరం

నిన్ను అర్థం చేసుకోకున్నా

నువ్వు రక్షించడం ఆపవు కదా


డబ్బు కోసమే చేస్తున్నావ్ కదా అని 

అభిప్రాయాలు విసిరినా

కండ కలిగీ

తోటివారిని కాపాడలేని మా మాటల్ని

నువ్వు పట్టించుకోకు

బతుకు విలువ తెలియని వారి రక్షణకు

పహారా కాయడం మాత్రం ఆపకు

వాళ్ళూ మారే రోజుగా

తరం కదులుతుంది


ఈ మట్టికి తెలుసు

జాతి కథకు నాయకుడు

అందరికీ అన్నం పెట్టే రైతని

సరిహద్దును కాపాడే సైనికుడని


అర్థమైన రోజు

ఆక్షేపణలు ఉండవు

అందరిలో రగిలే దేశభక్తికి రూపం నువ్వని



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract