STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

కసి

కసి

1 min
60


కలలను చంపి

తలలను వంచి

మొలలరజ్జు త్రెంచి

బ్రతుకలేము భారంగా

బానిసల్లా! షండుల్లా !

నరపీడనం నాల్కలు సాచినా

పాదతాడనం క్రింద నలిగినా

భోజ్యాలను నభమెక్కించినా

రాజ్యహింస చెలరేగినా

ఆజ్యం పోసినా కులాగ్నిలో

మత మారణ హోమం వ్రేల్చినా

మానవ హక్కులు మసిబారినా

మనిషిలో కసి రగులదేం !

కబళంలో లవణం కరువైందా

రుధిరంలో ఎఱ్ఱదనం మరుగైందా

కోడినై మేల్కొలుపుతాను

కవినై భువనాన్ని కవ్విస్తాను

ఉసిగొల్పుతాను

కత్తులొద్దు కటారులొద్దు

తుపాకులొద్దు తపంచాలోద్దు

జననీ భారతీ !

నీ అక్షర భిక్ష చాలు

ఓ కలం చాలు

నాలుగు కాగితపు ముక్కలు చాలు

అక్షరశరాలను సంధిస్తా

అంతరిక్షంలోకి

గాలిలోకి 

ధూళిలోకి

 భూనభోంతరాలు దద్దరిల్లేలా

భూసురునికి సైతం

పౌరుషం ఉప్పొంగేలా

చూడు చూడు

అటు చూడు

బిగిసిన పిడికెళ్లు ఉక్కులా

ఉబికిన రక్తనాళాలు 

వటవృక్షపు ఊడల్లా

అవిగవిగో వెనవేల దివిటీలు

చీకట్లను చిమ్మేస్తూ

ఇవిగివిగో త్రివర్ణ పతాకాలు

దేశభక్తిని చాటుతూ

వారిపోరు పాలకులపై

ఏలికల.కుర్చీలపై

నియంత భావాలపై

గజగజ వణుకుతూంది పీఠం !

మహాకవీ ! 

మహాత్మా !

శ్రీశ్రీ ! అటు చూడు తూరుపు

ఉదయిస్తూంది నీ మరో ప్రపంచం

ఎఱ్ఱని కందగడ్డలా

నీ హృదయం లా




Rate this content
Log in

Similar telugu poem from Inspirational