కొత్త లోకం
కొత్త లోకం
చదివే వాళ్ళు అక్షరాల జడీలో తడిసిపోవాలి,
పాఠకులకు కొత్తలోకం లోకి తీసుకెళ్తుంది,
మనసును హాయి గొలుపుతుంది,
ఆనంద డోలికల్లో ముంచేస్తుంది,
కవికి అక్షరాలు వరం,
ఎన్నో ఆలోచనల మధ్య పురుడోసుకుంటాయి,
విలువలతో కూడుకున్నాది,
అక్షరాలు అన్ని పవిత్రం,
చీకటి జీవితాల్లో వెలుగు నింపే ఆయుధం,
రాసే కవులకు అక్షరాలు ధైర్యమై నిలుస్తాయి,
సమాజం మీద అక్షర బాణాలు విసురుతాడు,
చదివిన కొద్ది చదవలనిపించే కవితలు,
ఒక్కో అక్షరం పేర్చి అందంగా అక్షరాల ప్రయాణం,
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా విడువం,
మా అక్షర ప్రయాణం ఆగిపోనిది అలసిపోనిది,
నిరంతరం సాగిపోయే అక్షరాల నీడలో సేదతీరే
కవులు.....
