కోతిబొమ్మల్ని అనుసరించకు!
కోతిబొమ్మల్ని అనుసరించకు!


కోతిబొమ్మల్ని
అనుసరించకు!
.....................
చెవులురిక్కిస్తే
చెడు పుకార్లే వినబడతున్నాయ్
కళ్ళుతెరిస్తే కల్పితవికృతదృశ్యాలే కనబడుతున్నాయ్
నోరుతెరిస్తే
అసత్యాలే !వ్యాథిజనకాలె వెలువడుతున్నాయ్
'మంచి'లా
మేకప్పును కప్పుకుంటోంది 'చెడు'!
మాయలుచేతగాక
'చెడు'లా చెప్పబడుతోంది 'మంచి'
కలగాపులగమైపోయింది లోకం!
ఏదిమంచో ఏది చెడో
చెప్పాల్సిన మేథావులమెదళ్ళు
పదవులకూపురస్కారాలకూ
అమ్ముడుపోయి చెప్తున్నాయ్ సొళ్ళుకబుర్లు
కోతిబొమ్మల్నిచూడకు!
అవేవో మహాత్ముల సైగలనుకోకు!
చెప్పేవన్నీ వినాలి!
జరిగే వన్నీ చూడాలి!
స్వయంవిచక్షణతొ
నోరుతెరవాలి!!
చెప్పేందుకైనా
తినేందుకైనా
మేథస్సును పొంగించాలి!
ఎదిగేందుకైనా
బ్రతుకేందుకైనా
ప్రగతిని పొందేందుకైనా!!
ఏ మనిషి తలలోనైనా
మేథావుల తలలోనైనా
మాంసపు మెదడే ఉంటుంది
ఆలోచించుట మొదలెడితే
సరైన జవాబు వస్తుంది!!
పని పెట్టు కొంత సొంత మెదడుకు!
జీవితాంతం పరులపై
బానిసవలె ఆధారపడకు!!
గాదిరాజు మధుసూదన రాజు