కొన్ని జ్ఞాపకాలు
కొన్ని జ్ఞాపకాలు
కొన్ని జ్ఞాపకాలు
ఎడారిలో పూలు పూసినట్టు
అగుపించి మురిపిస్తాయి
కొన్ని జ్ఞాపకాలు
రోజాపూల పరిమళంలా
చుట్టేస్తూ ఉంటాయి..
కొన్ని జ్ఞాపకాలు
గులాబి ముళ్ళు
గుచ్చినట్లు
బాధిస్తుంటాయి
కొన్ని జ్ఞాపకాలు
అగరొత్తుల ధూపంలా కమ్మేస్తుంటాయి
కొన్ని జ్ఞాపకాలు
నల్లని మేఘాల్లా
అలుముకుంటాయి
కొన్ని జ్ఞాపకాలు
సముద్రంలో
ఎగసిపడే అలలుగా అలజడి సృష్టిస్తుంటాయి
కానీ నీ జ్ఞాపకాలేంటో మరి
విరిసి విరియని పువ్వులా
విరబూసిన వెన్నెలలా
పూవుల్లో దాగిన మకరందంలా
హాయిగా సాగే
మేఘమాలికలా
మనసును
ఊయాలలూగిస్తూ
ఉంటాయి

