కన్నీటి సంద్రంలో
కన్నీటి సంద్రంలో
నీ భావాల పాదాలతో నా మనసుని తొక్కేయకు మరి.
కావాలి నాకు విముక్తి బంధించిన నీ పిడికిలి నుంచి
కావాలి నాకు విముక్తి నీ మనసు పంజరం నుంచి..
వదలరాద నన్ను నాకే లేని లోకంలో
వదలరాద నన్ను నీ ప్రేమ చెరసాల నుంచి..
ముందే నేను కన్నీటి వరదలో మునిగి ఉన్నాను.
మళ్ళీ నువ్వు ఇంకా..
ఇంకా...
కారణం కాకు నా కన్నీటి వ్యథకు..
నేను ముందే వ్యథల సముద్రంలో విహరిస్తూ ఉన్నాను.
నేను ఉన్నదే కన్నీటి సంద్రంలో..
