STORYMIRROR

harish thati

Tragedy Inspirational Others

4  

harish thati

Tragedy Inspirational Others

కన్నీటి మూట

కన్నీటి మూట

1 min
291

కనిపించే కన్నుల్లో కనబడని కన్నీల్లేన్నో

కవ్విస్తూ కదిలేటి కాలం సాక్షిగా

 కనుపాప నిండుగా కన్న కలలెన్నో

కనురెప్ప మాటున కల్లల్లై కరిగేనెన్నో

చిందిస్తున్న చిరునవ్వుల్లో చిగురిస్తున్న వేదనలెన్నో

ఒంటరినై ఒదిగున్న ఈ నిశిలోనా

అడుగేస్తూ నువు నిప్పుల వలయంలో 

నడవక తప్పదు ఈ పయనం

బదులే నిన్నడగని లోకానికి

ప్రశ్నయి నువ్వు ఎదురెళ్తే ఏం లాభం

ఉసురుమన్న ఊపిరి పిలుపు

ఆశగా నిను పిలిచిందా

ఏ మలుపు రాదునీ తెలిసి ఈ గమనంలో

నీ బాదే తోడై వస్తుంది కడ దాకా

ఎదురీతేగా ఈ బ్రతుకు సంద్రంలో పాశానపు మార్గం

అలుపోచ్చే వేళా అమ్మే గుర్తోస్తుంటే

భీష్మస్తూ ఉంటే దైవం కరుణించి

చేయీ జాచి తన ఒడిలోకి ఒదిగేమంటే

తీరదన్న కల ఇంకా తీర్చుకుంటూ అలుపెరుగని తీరంలో

ఉలి దెబ్బల్ను తింటూ నీ తత్వం 

మార్చుకుందా మనిషల్లే.


హరాక్షర 3074@


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy