STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

కన్నీటి కలం

కన్నీటి కలం

1 min
6


కొండపై నుంచి రాలిన ఒక ఆకు 

మోసుకు వచ్చిన విస్మయ గీతం 

నా హృదయ లోయలోకి 

నిదానంగా జారిపోయింది 


అమ్మ పాట నేర్చుకున్న పక్షి 

మళ్ళీ మళ్ళీ చిన్ననాటి పల్లవిని 

వల్లిస్తూనే ఉంది !


జలపాతాల వెంట జాలువారిన 

అలనాటి స్మృతుల్ని, 

కాగితపు పడవలు చేసి 

నదుల్లో వదిలేస్తున్నాను . 


జారుతున్న దుఃఖాన్ని 

హృదయానికి అద్దుకొని

గుండెల్లో దచుకున్నాను !

భాష్ప మిత్రమా నీవే కదా 

కడదాకా నను వదలని నేస్తానివి ! 


నాలోని దు:ఖాగ్నిని 

అర్పేస్తూ.. జాగృత పరుస్తూ 

కన్నీళ్ళు నింపిన 

కలాన్ని నాకందించి  

అశ్రుమయ లోకాన్ని  

అక్షర మయం చేయమంది !


Rate this content
Log in

Similar telugu poem from Romance