STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

కన్న కలలే

కన్న కలలే

1 min
153


కన్న కలలే గుర్తు కొస్తే నిన్ను తలచానెందుకోయీ?

వలపు కోసం పిలుపునిస్తే నన్ను విడిచావెందుకోయీ?


చెలియ కోసం ఎదురుచూస్తూ చిత్తమేమో అలసిపోయెను 

ఆదరించక అలకమానక మదిని విరిచావెందుకోయీ?


జీవితాంతం ప్రేమలేఖల స్మరణతోనే మురిసిపోతిని 

చెలిమి చూపక చేరదీయక మరలి పోతావెందుకోయీ?


జతగచేరిన జంటపక్షుల మూతివిరుపుల రీతి మనదే

వీడి పోతూ వాడి బాణం ఎదల గుచ్చావెందుకోయీ?


ఇంతకాలం వేచివున్నా విరహవేదన తరగకున్నది 

తిరిగిచూడక దిగులుతీర్చక వదిలివెళ్ళావెందుకోయీ?



Rate this content
Log in

Similar telugu poem from Romance