కనిపించట్లేదు చదువుల్లో
కనిపించట్లేదు చదువుల్లో
కనిపించట్లేదు చదువుల్లో
............
మెదడునిండా
రూపాయలకై
ఉపాయాలే
బడులు
కాలేజీలేవైనా
కోర్సులేవైనా
తలుపులుతట్టేది
పెట్టుబడులు
రాబడులతలపులతోనే
మనిషిగా
మనసుతో
తడుములాటలుండవ్ చదువుల్లో
తలకో
పనిగా
మునకలౌతున్న
కుటుంబపు పలకరింపుల్లో
ఇంట్లోకలుస్తున్న
నిర్ణీతసగటు సమయాల్లో
వెతుకులాటలుంటాయ్ కారణాలకై మిగిలినపనుల్లో
హోంవర్కు ఉంటే అది కాగితప్పనే!
అక్షరాస్యతంటే
ధనార్జనార్హతే!
శీలం త్యాగం నీతి మానవత్వాల ఆనవాళ్ళేవీ పాఠాల్లో కనీసం ఉన్నట్లే
నేటి చదువుల్లో ఎక్కడా కనిపించట్లే!!!