STORYMIRROR

Nannam Lokesh

Abstract Fantasy

4  

Nannam Lokesh

Abstract Fantasy

కనిపించని స్వప్నం

కనిపించని స్వప్నం

1 min
238

నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉండిపోతున్న

ఏమో నాకే ఎందుకిలా అనుకునేలోపు

మాయమై కలలో నాభ్రమలో మైమరచివుంటున్న

ఆ తార ఎదుట కనిపించేలా ప్రయత్నించేలోపు

కనుమరుగై అదృశ్యం అయ్యి వెళ్లిపోతున్న

నిన్ను చేరలేక నేను నా ఆలోచనలు ఉండేలోపు

ప్రకృతిని అలవాటు చేసుకొంటున్నాను


సంభాషణలు కలయిక ఏర్పడాలని కోరుకుంటున్న

నీ ఆమోహమైన నడవడికను చూసేలోపు

నేను నా హృదయాన్ని అర్థంచేసుకొంటున్న

ఆ కనిపించని సుందరిని కలిసేలోపు

జాడలు అదృశ్యంమై దారి ఏర్పడుతున్న

వెతికిన సంఘటనలు లెక్క చేసేలోపు

భావాలకు సమాధానం చెప్పుకొంటున్నాను


ప్రేమ అనే స్వచ్చమైన మనసులో ఉంటున్న

ప్రతి చిన్న కదలికలకు ప్రాణం పోసేలోపు

అర్థంఅయ్యే భాషలో చెప్పుకుంటున్న

నా నిర్మలమైన హృదయ స్పర్శలో ఉండేలోపు

నీ హవ భావాలకు వివరించేలేక పోతున్న

నీ అలజడికి ఏమి చెయ్యాలి అనుకునేలోపు

ఆ కనిపించని స్వప్నమై ఉండిపోతున్నావు


 



Rate this content
Log in

Similar telugu poem from Abstract