కలవని కలయికని కలే కన్నాములే
కలవని కలయికని కలే కన్నాములే
కలవని కలయికని కలే కన్నాములే
కనిపించనన్నానని కలవరపడుతున్నావ
కలల దారులలో కాపు కాసి చూస్తున్నావ
కౌముది కౌగిలిలో కల కంటున్నావ
కలగన్నావ నామది విని కనిపించని నా సవ్వడిని
కలలే ఇక మనకి మిగిలి కనుమరుగైన పెన్నిధి
కదిలే కాలానికి ఎదురెళ్ళి కాలేను నీకు ఏమి
కాదన్న నిజాన్ని కడవరకు సాగని
కాలగమనంలో కలిసిపోయే కలలే కనకు మరి
కనిపించే నీ పలుకులు కని కనుల ముందుకు రాలేనని
కలయిక జరగని కలవని నేను కల కన్నానులే
కలే నేను నీ కలే కన్నాను కలవని కలయికనని
కలే కన్నాములే కలల కౌగిలిలో కరిగి..
