STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కలువ పూవు

కలువ పూవు

1 min
10


విరియుచున్న కలువ పూవు నవ్వుతుంది నన్ను చూసి,
పరచుకున్న వెన్నెల సిరి. మరుగుతుంది నన్నుచూసి.!.

చలువరాతి మేడ కూడా వేడెక్కెను నిట్టూర్పుతొ
తుహినకణము జాలిచూపి కురుస్తుంది నన్ను చూసి..!

నీవు లేక,నీవు రాక క్షణము కూడ యుగమాయెను.
తపన పడిన మనసంతా వెరుస్తుంది నన్ను చూసి..!

స్వప్న వీథి కాంతులలో కాలమంత కరిగిపోయె..!
నిశి రాతిరి వేదనెంతొ చిలుకు తుంది నన్ను చూసి

పరిమళించు సుగంధాల వాయువేదొ తరలిపోయె!
కన్నీరే పరిహసించి పలుకుతుంది నన్ను చూసి

సుడిగుండాలెన్నో మరి సంద్రమంత మదినిండా
ముంచేసే పడవొక్కటి కులుకుతుంది నన్ను చూసి



Rate this content
Log in

Similar telugu poem from Classics