కల్పవృక్షం
కల్పవృక్షం


ప౹౹
వలపు జ్వాల వదలకనే ఒడిసి పట్టవోయి
తలపు వాకిలి తెరచి తనవునే తట్టవోయి౹2౹
చ౹౹
ఈ క్షణం మరలా రానిది మరి మరిపించు
తక్షణం తరలి మదిలో ఆశనే మురిపించు౹2
కోటి కోర్కెలను కోరే కోరికనే శాసించుము
సాటి సరసములే సాదరంగ సాధించుము౹ప
చ౹౹
నిత్యప్రేమ నికరమై ఎలుగొందు నీ ఎదలో
అత్యాధునికమై కనిపించాలని ప్రతి కథలో౹2
కలిసి వచ్చిన కాలం కోరదుగ ఏ శకునము
తెలసికొన ఆ ప్రేమనే మరి కోరులే ప్రతికోణం ౹ప౹
చ౹౹
వేకువ వెలుగులా పెరెగే ప్రేమ ప్రతినిమిషం
వేగువలే ఎడదచేరు లెక్కించక మీనమేషం౹ 2౹
తనువు మెచ్చిన చెలిమి కోరెను తన పక్షం
అనువైన కూరిమి మనసులోన కల్పవృక్షం ౹ప౹