STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Tragedy

4  

Dinakar Reddy

Abstract Drama Tragedy

కళ్ళు మూతలు పడుతున్నాయి

కళ్ళు మూతలు పడుతున్నాయి

1 min
299

ఎక్కిళ్ళు వస్తున్నా మాటలు ఆగలేదు

చెక్కిళ్ళు నొప్పి పుడుతున్నా

నీ పేరును పిలవడం ఆపలేదు


చిన్న పిల్లలు నురగ నీటితో చేసిన బుడగల్లా

కొన్ని సంవత్సరాలు అలా వెళ్లిపోయాయి

అందులో ఏవి ఏమయ్యాయో తెలీదు


ఇవాళ ఎందుకో బాధ తెలుస్తోంది

ఇక నువ్వు రావని తెలిసిపోయిందేమో

ఆశగా పూసే కనకాంబరం వాడిపోయింది

మళ్లీ చిగురింపజేయొద్దు అన్నట్టు వేడితో కాల్చుకుంది


గొంతులో సన్నటి జీర

వెంటనే వచ్చే పెద్ద దగ్గు

ఆ దగ్గుకు ఏవేవో పేర్లు పెట్టేశారు


వెలిగించిన చేతులే ఆర్పేస్తున్నట్లు పెరట్లో దీపం కొండెక్కుతోంది

గడపమాను రాసిన పసుపు ఎటో వెళ్ళిపోతోంది


ప్రణయం వ్రణమై విధి వెకిలిగా నవ్విన క్షణాన

రాబందుల రెక్కల చప్పుడు విని 

ప్రేమగా నీ ఫోటో ఉన్న వైపు చూసుకుంటూ ఒక పక్కకి ఒరిగాను


కోట్ల ఆలోచనలు సర్రున తెగిపోయినట్లు అనిపించింది

భారంగా ఎగశ్వాస తీస్తుంటే

కళ్ళు మూతలు పడుతున్నాయి

ఆ కళ్ళలో నిన్ను దాచుకోవడం బరువుగా అనిపించింది

#LoveLanguage


Rate this content
Log in

Similar telugu poem from Abstract