STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

కలాం గురూజీ కో సలాం

కలాం గురూజీ కో సలాం

1 min
253

అంశం: భారతదేశము-అబ్దుల్ కలాం

శీర్షిక: కలాం గురూజీ కో సలాం 

కవిత: వచన కవితా గీతం : 17.07. 2021


పుట్టితివే ప్రజల మనిషిగా -

 పెరిగితివే కష్టాల కడలిలో 

ఎదురీదితివే లక్ష్యాల బాటలో 

పరికించితివే కలల ఉద్ద్యేశాలే 


వార్తా పత్రికల్ని వ్యాపింపజేసితివే 

లలిత కళలలో ప్రీతిని చూపితివే 

శాస్త్ర శాస్త్ర రంగాల తొలిమెట్లు ఎక్కితివే 

పుస్తక రచనలతో భవితకు దిశా నిర్దేశం చూపితివే 


విద్యార్థులందరికో ఆచార్యునిగా మారితివే 

ఆలోచనల సరళిలో అద్భుత గమనం చూపితివే 

ఎందరికో ఆదర్శప్రాయునిగా చిరంజీవిగాఇలలో వెలిగితివే

ఖగోళ రంగానికి చేరువలో భారతాన్ని నిలిపితివే 


ప్రజల మనిషిగా - సామాన్యుని రాష్ట్రపతిగా దేశాన్ని పాలించితివే 

ఆచార్యునిగా మారి బోధనలనెన్నో చేసితివే 

క్షిపణుల రూపాలన్నీ ఆవిష్కరింపజేసితివే 

భరతమాత సేవలలో సదా తరియించితివే 


అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం నీదేనని 

ప్రపంచంలోవెలుగుతున్నభారతరత్నంనీవేనని 

సదా జన్మ దినాన - పుణ్య తిథియందు కూడా 

మీ కీర్తిని తలచి - చిరకాలం యశోవంతముగా తరియింతుము మేమని 

 ఎల్లప్పుడూ మీ మార్గనిర్దేశనాన్ని అనుసరించుతూ :


వ్యాఖ్య : అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలతో పాటుగా

కలాం గారి వర్ధంతి సందర్భంలో వారికి మా ఈ నివాళులు - కవీశ్వర్ 


 


Rate this content
Log in

Similar telugu poem from Abstract