STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కలా! దూరంగా పో..

కలా! దూరంగా పో..

1 min
282

నువ్వు బాగుంటావ్

నీ కోసం చేసే ప్రయత్నం కష్టమే

కానీ చాలా ఇష్టంగా ఉంటుంది


నువ్వు పూర్తయితే ఇంకా బాగుంటావ్

లేకుంటే

దుప్పట్లో దూరిన దోమలా కుడుతూ

నన్ను నిద్రపోనీవు

చల్లగాలికి సలిపే గాయంలా 

స్థిమితంగా ఉండనీవు


అందుకే నువ్వంటే నాకు భయం

నిద్రలో నువ్వొస్తే గబుక్కున లేచి కూర్చుంటాను

పాత పాటలు పాడుకుంటూ

చిరిగిన ఆత్మవిశ్వాస వస్త్రాన్ని కుట్టుకోవడానికి

సూదీ దారం వెతుక్కుంటాను


ఇక చాల్లే

నాకిక ఓపిక లేదు

నువ్వు రాకు

పో 

దూరంగా పో

అందమైన జీవమున్న ఓ కలా!

నన్నంటకు 

నీ దిక్కున్న చోటికి పో



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract