STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

కెరటం

కెరటం

1 min
28

ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్ని మోసుకు వస్తున్నట్టు ఉంటుంది కెరటం

చిలిపితనానికి చక్కిలిగిలిపెట్టినట్టు వంకరలు తిరిగిపోతుంటుంది

ఎంతటి కన్నీరు నైనా తనలో కలిపేసుకుంటుంది

తీరానికి వచ్చే ముదుసలిని కూడా పిల్లవానిని చేస్తుంది

ఇసుకతో కట్టే గుళ్లు తనకి నప్పవేమో తనలో కలిపేసుకుని నవ్వు కుంటుంది

ప్రేమతో రాసుకునే రాతల పసితనానికి మురిసిపోతుంది

ఎన్నో బాధలకు సంతోషాలకు మౌనవేదిక అవుతుంది

పాలనురగల పసినవ్వులకు పుట్టినిల్లు కడలి

ఓదార్చే హృదయలోగిలి.


Rate this content
Log in

Similar telugu poem from Romance