కాలుష్యాణుమారణాస్త్రం
కాలుష్యాణుమారణాస్త్రం
యుద్ధోన్మాదంతో
ఏ ఉగ్రరాజ్య నియంతయో
ఆకాశంనుండి వదలివేసే అణ్వస్త్రవిస్ఫోటంతోనో
జీవాయుధతంత్రంతోనో
విశ్వధ్వంసం జనవినాశనం...
అనూహ్యంగా
హఠాత్తుగా
భీభత్సంగా జరగకముందే
స్వార్థంతో మూర్ఖంగా సాగిస్తున్న మర్త్యవాణిజ్య అకృత్యాలతో వ్యాపిస్తున్న కాలుష్యాలన్నీ.....,,
విషమేఘాలై
క్రమ్ముకుంటున్నాయ్
ప్రగతిపేరుతోదేశాల్లోంచి
దేశాల్లోనిరాష్ట్రాల్లోంచి
రాష్ట్రాల్లోని నగరాల్లోంచి
నగరాలౌతున్న పల్లెల్లోంచి
పంటపొలాల్నిమ్రింగేస్తున్న
ఫ్యాక్టరీ గొట్టాల్లోంచి
ఫ్యాక్టరీలఉత్పత్తులనుంచి
వ్యావృత్తమౌతున్నాయ్ మృత్యుకాలుష్యలీలలు వాయులీనాలై!! దృశ్యాదృశ్యంగా
నెమ్మదినెమ్మదిగా
ప్రపంచాన్నికబళించటమే ధ్యేయంగా!!
స్వయంకృతాపరాధం
స్వీయకాలుష్యాయుధం!
నియంత్రణం కోల్పోతే
జరుగుతుంది దారుణం!
తస్మాత్ జాగ్రత్త!!