STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కాలం చెల్లిన

కాలం చెల్లిన

1 min
6



కాలం చెల్లిన మాటలు..శాసనాలు అయ్యేనా..!? 
అధికారం చెలాయిస్తె..సునామీలు బెదిరేనా..!? 

క్షేత్రమెంత సిద్ధపరచి..ఏంలాభం ఓ నేస్తం.. 
పుచ్చులేవొ ఎదపెడితే..మొలకలేవొ వచ్చేనా..!?

రూపాయిని మింగేస్తే..కడుపెలాగ నిండుతుంది.. 
ఆత్రపడే గుణముంటే..ప్రాణాలే నిలిచేనా..!? 

'ఏ-ఐ'తో రోబోలే..కంటాయట శిశువులనిక.. 
నీ నిపుణత రొదపెడితే..స'రసాలే పండేనా..!? 

పంట చేతికొచ్చేందుకు..రైతుపడే పాట్లెన్నో.. 
దళారీల దోపిడీకి..చెమటబొట్టు బలియేనా..!? 

సాఫ్టువేరు ఉద్యోగం..విదేశాల వ్యామోహం.. 
మనశ్శాంతి సంపదతో..వెర్రియాట ఆడేనా..!? 


Rate this content
Log in

Similar telugu poem from Classics