STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కాలానికి గంతలు కట్టిన

కాలానికి గంతలు కట్టిన

1 min
394


రేఖా చిత్రం ఏదైతేనేం మనుషులమే కదా 

సప్త వర్ణాలు పులుముకొని నటిస్తున్నాం

ఆకాశపు తెరకింద బొమ్మలాటలు సాగిస్తూ

బొమ్మ బొరుసుల బతుకాట ఆడుతుంటాం..


సగము మూసిన కళ్ళతో లోకం చూస్తూ

చీకటిని తొలగించే ప్రయత్నం చేస్తూ

వెలుగన్నది లేదనుకుంటూ సాగుతూ పోతూ

అర్ధ రోజులు మాత్రమే స్వీకరిస్తున్నాం...


కాలానికి గంతలు కట్టాలని కలలు కంటూ

తిరిగిరాని రోజు కోసం ఆశలు పెంచుకుంటూ

నర్మగర్భంగా నవ్వడం నేర్చుకొని 

మాయని గాయాలను హృదయానికి తగిలిస్తాం...


వెలుగు చీకట్లను బంతిలా ఎగరవేస్తూ

నేలను ఆకాశానికి తగిలించాలని భ్రమపడుతూ

లేని రెక్కలను తొడిగి నింగిలో తిరుగుతూ

ఆకాశ పంట నంత ఆరగించాలని చూస్తాం..


మన నీడను చూసుకొని చిన్నగా లేస్తూ

కొండంత పెరిగానని కోటి అబద్ధాలు వర్ణిస్తూ

ఆశల కొలనులో రాళ్లు విసిరి సుడులు తిరుగుతూ

పిడికిలి వదలి వేళ్ళకు పని చెప్పి గొణుక్కుంటాం..


పచ్చికాయలను పోగు చేసుకుంటూ

మధురమైన రుచులను మర్చిపోయి ఏడుస్తూ

యవ్వనపు వయసును మత్తులో నిద్రపుచ్చి

వృద్ధాప్యములో జ్ఞాపకాల కోసం పరితపిస్తాం...




Rate this content
Log in

Similar telugu poem from Romance