STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

జ్యోతిష్యుడు - వారఫలాలు

జ్యోతిష్యుడు - వారఫలాలు

1 min
373

దశ తిరుగునని

జనత జాతకములు చూసి

భవిష్యత్తు చెప్పు జ్యోతిష్యుడు

అద్భుతముగా లాభం వచ్చునని

పరిపరి విధముల తలచుకుని

వారఫలములు చూసి బయటకేగె


పొగుడు వారు ఎక్కువై

సభలో ప్రసంగం పొడిగించి

అందరికీ జాతకము చెప్పెను

సన్మానముతో సంతసించెను

ఒడలు మైమరచి ఉప్పొంగెను


ఇంటికి చేరిన పిదప

పుష్ప గుచ్ఛములు పక్కన పెట్టి

పర్సు కోసం వెతికెను


పోగొట్టుకున్న పర్సు 

వారఫలంలో వ్రాసి లేదని ఊరకుండెను

మరల పంచాంగము చూసి ఏదో లెక్కగట్టెను 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract