జన్మలు గా
జన్మలు గా
నీవు నేను ఒకరికొకరు బహుమతులం జన్మలుగా..!
నిజము చూడ మధురమైన ప్రేమికులం జన్మలుగా..!
కోపాలకు తావులేని కోవెలయే ప్రతి హృదయం..!
తపనలన్ని అధిగమించ తాపసులం జన్మలుగా..!
దివ్యమైన వలపులతో కలలుగనే చినుకులమే..!
మెరుపు లతలమైసాగే స్నేహితులం జన్మలుగా..!
అనురాగపు వెన్నెలకే వన్నెలిడే రాగాలం..!
సరసవీణ స్వరధారల వారసులం జన్మలుగా..!
ప్రతి సంగతి జ్ఞాపకాల కడలి అలల చేరి దాగె..!
కవ్వించే పలు ఆశల ఆశ్రితులం జన్మలుగా..!

