STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"జీవితపు వాణి"

"జీవితపు వాణి"

1 min
572

నా జీవితమొక రచనల పుస్తకమోయ్!

నే గడుపుతున్న క్షణాలే.. చెరిగిన అక్షరాలోయ్!

నే పటిస్తున్న విధులే.. మసకబారిన పదాలోయ్!

నే పరుస్తున్న లక్ష్యాలే.. గాడితప్పిన వాక్యాలోయ్!

నే నేర్చుకున్న లక్షణాలే.. చెదిరిన పద్యాలోయ్!

నే అలవరుస్తున్న జీవిత పాఠాలే.. అర్థంలేని అధ్యాయాలోయ్!

అందుకేనటోయ్..!

పరులకు మాత్రం అది చెదలు పట్టిన నలిగిన పుస్తకమటోయ్..!

కనీసం దాన్ని చదవడం సంగతి దేవుడెరుగునటోయ్..!

దాని వంక చూడాలన్నా... వారికి అయిష్టమేనటోయ్..!!

నా జీవితపు వాణిని వినిపించాలానే నాకో ఆకాంక్షోయ్..!!!

అందులకు నాకార్హత తగునటోయ్..?

ఎందుకంటేనోయ్..!,

విలువైన నా ఈ జీవితం ఓ తెరిచిన పుస్తకమోయ్..!!

అందులో... కథా నాదేనోయ్..!, పాత్రా నాదేనోయ్..!!

కర్మా నాదేనోయ్..!, చివరికి దానికి కర్తా నేనేనోయ్..!!

క్రియ మాత్రం విధి ఆడించే ఓ వింత నాటకమోయ్..!!

అందులో... నే బలిపశువునైతినోయ్..!

సత్య పవన్✍️



Rate this content
Log in

Similar telugu poem from Classics