జీవితం
జీవితం
విరిసే కూసుమాన్ని చూస్తే
కలుగుతుంది మనసు లో ఓ ఆనందం
గల గల జలపాతం ను చూస్తే
కలుగును మనసుకు ఓ శాంతి
పారె సెలయేరుని చూస్తే
కలుగును ఓ ఉత్తేజం కళ్ళకు
పచ్చని పొలం గట్టుని చూస్తే
పారిపోవును కదా ఆకలి
మిఠాయ్ కొట్టులో హల్వా
చూస్తే పిల్లల పెదాలన
ఊరును కదా లాలాజలం
రోడ్డు మీద అందమైన అమ్మాయి ని చూస్తే
అబ్బయి మనసులో కలుగును కదా ప్రేమ
రుచికరమైన స్వీట్లు చూస్తే
తండ్రి మనసున జ్ఞాపకం
వచ్చును కదా ఇంటిలో ఉండే
తన పిల్లలకు ఇష్టం అని
అందమైన రంగు బట్టలు చూస్తే
అమ్మకు కలుగును కదా ఆనందం
తన పాపకి ఆ బట్టలు బావుంటాయి అని
క్రొత్త పుస్తకం బజారు లో చూస్తే
తన తండ్రి ఇంటిలో ఒంటరిగా
వున్నాడని కొని ఇస్తే చదువుతారనే జ్ఞాపకం
కాలం కలిసి వస్తే పుణ్య క్షేత్ర దర్శనం చెయ్యాలనే
కోరిక అత్తగారి మనసున మెదిలితే
బంగారు కోడలు అత్తమామలను
క్షేత్ర దర్శనం కు పంపమని భర్తను అడిగిన
సర్వేజనా సుఖినోభవంతు
