జీవితానికి ముందు మాట
జీవితానికి ముందు మాట
జీవితం ఒక రంగుల వలయం
ఆరంభం అంతం తెలియదు
పరిచయం అయిన పుస్తకంలాంటిదే జీవితం....
జీవితంలో ప్రతీ అంశం ఎదో ఒక ఆలంబన
నిన్నటికి నేడు కొత్త,రేపటి రోజు అన్నది కేవలం ఆశ మాత్రమే....
ఉదయించే సూర్యుడిని చూస్తామో లేదో తెలియదు
జీవితానికో ముందుమాట
ముందు చూపు లేకుంటే భవిష్యత్తులో ఏమి సాదించలేము....
జీవితం అంటే విలువ
భవిష్యత్తు అంటే అవగాహన
లేకపోతే ప్రతీ చిన్న విషయం రాద్దాంతం చేయడమే
ఒకరిని ప్రశ్నించే ముందే
మన దగ్గర సమాధానం వుండాలి,లేకుంటే భవిష్యత్తులో ప్రశ్న విమర్శగానే మిగిలి పోతుంది....
జీవితం అంటే విమర్శ విశ్లేషణ
కాదు.. సామర్థ్యం, సమర్థత....
"జీవితానికో ముందుమాట "అప్పగింత కాదు....
ఇచ్చిన మాట ప్రకారం నడుచుకునే వాళ్ళు ఎందరు???
మాట తీరు మాధుర్యం లేని వాళ్ళు అవహేళన కోసమే పుట్టినట్లు ఇతరులను బాధపెట్టకుండా వుంటే చాలు...
జీవితం అంటే కదిలే కాలంతో పరుగులు
ఒక నిశబ్దం యుద్దం....
