STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Inspirational Others

3  

VENKATALAKSHMI N

Abstract Inspirational Others

జీవిత పుస్తకం

జీవిత పుస్తకం

1 min
202

కష్టాల వాకిళ్ళు

స్వాగతించాయని

దిగులు మబ్బులు 

కమ్ముకున్నాయని

ఆశల చివుళ్ళు

రాలిపోయాయని

సుడిగుండం వచ్చి

మింగేసిందని

ఆశయ సాధనలు

గతి తప్పాయని

నిస్సత్తువ నిస్తేజం

కావలించాయని

కష్టాలు కరచాలనం

చేశాయని

తలవాకిట నిలబడి

ఓటమి వెక్కిరించిందని

అనుకోని సంఘటన

జరిగిందని

తలచినది 

సాధించలేకపోయాని

అమ్మ కొట్టిందని

నాన్న తిట్టాడని

పక్కింటోళ్ళు 

పట్టించుకోలేదని

నిన్ను చూసి ఎగతాళిగా

నవ్వారనీ

.,..............‌..‌

ఇలా నిన్ను నువ్వే

తక్కువ చేసుకుని

"ఎవరికోసం"ఈ బ్రతుకని

మొగ్గలోనే తుంచేయడం

ఎంత నేరం ఘోరం

నిండు నూరేళ్ళ

జీవిత పుస్తకాన

ఆఖరి పేజీ వరకు

ఆస్వాదించాల్సిందే

అంతు తేల్చాల్సిందే



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract