STORYMIRROR

Dinakar Reddy

Abstract Thriller

4  

Dinakar Reddy

Abstract Thriller

జడుసుకున్నా

జడుసుకున్నా

1 min
386

పాత ఇనుమును పట్టుకున్న తుప్పులా

పాత్రలకు పట్టిన మకిలిలా

నేను నీ ఆలోచనల్లో పడి

పడ్డచోటే ఉండిపోతానేమో అని భయం


మనిషిలో దేవుణ్ణి

దేవుడిలో మనిషిని

పరాకులో పరమార్థాన్ని

ఇలా అన్నీ చూస్తానని భయం


బట్టలు ఆరేస్తే వర్షం వస్తుందని

తడిస్తే జలుబు చేస్తుందని

ఏడిస్తే అందం పోతుందని

నవ్వితే నలుగురూ ఏమనుకుంటారో అని భయం


ఇన్ని భయాల మధ్య 

నేను నిన్ను మరచిపోయి 

మళ్లీ ఏ కోన్ కిస్కా గొట్టంతోనో గ్రంథం నడిపి

దాన్నే ఇహలోక పవిత్ర ప్రేమని చాటింపు వేసుకొని

పనికిమాలిన యవ్వారాలు నడుపుతానని

ఒకానొక నమ్మకంతో జడుసుకున్నా

భయమంటే అంటే అంటూ నసుగుతున్నా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract