ఇరుకునబడ్డాయ్
ఇరుకునబడ్డాయ్


ఇరుకునబడ్డాయ్
------------------------------
ప్రయాణాలు
ఆగిపోయాయ్
మెతుకు భరోసాలు
ఇరుకున బడ్డాయ్
కొనఉపిరితో
పేదలదేహాలుకూలబడ్డాయ్
కరోనా కాటేయకున్నా
పేదకు 'ఆకలిచావే' గతి!
మసకబారుతోంది
మానవ ప్రగతి!
మరుగున పడుతోంది
మానవత్వకారుణ్య సంస్కృతి!!
కాలం తుడిచేస్తుంది కష్టాల్ని
దిటవుచేసుకో గుండెల్ని!
చూస్తాం మళ్ళీ ఆనందాల్ని
నిలుపుకో మానవానుబంధాల్ని
నిరూపించుకో నీ మంచితనాన్ని!
అందించు వీలైతే నీ అభయహస్తాన్ని!!