STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఇంకో మనిషి

ఇంకో మనిషి

1 min
6



అందమైన మనిషిని చూస్తావు.
లోపల వ్యధ కనబడదు.
నవ్వు కనబడుతుంది.
పడే బాధ కనిపించదు ఎవరికి.
వేసుకున్నా చొక్కా చూస్తావు.
ఆ జేబు వెనుక దాగున్నా హృదయం తాలూకు 
వేదన కనబడదు. 
పర్సు లో దాగున్నా పచ్చనోట్లు కనబడుతాయి.
దానికోసం పరిగెత్తే పరుగులు చూడరు.
అందరిలో ఉన్నప్పుడు ఆనందం గా కనిపిస్తావు.
లోలోప కమిలిపోవడం చూడరు.
చూసే కన్నులు కనబడుతాయి.
ఆ కంటి లోదాగున్నా కన్నీళ్లు కనబడవు.
చేసిన కష్టం కనిపించదు.
పేరు ప్రతిష్టలు చూస్తారు.
గౌరవాన్ని చూస్తారు.
మంచి మాటలు చెబితే పట్టించుకోరు.
చెడు నే నమ్ముతారు ఈ రోజుల్లో.
వచ్చిన విజయం కనబడుతుంది అందరికి 
ఆ విజయం కోసం పడిన తపన కనబడదు 
ఎవరికి ఎప్పుడు ఏ నాటికి..
మనిషి లో ఇంకో మనిషిని కనబడాడు ఎవరికి.
                    


Rate this content
Log in

Similar telugu poem from Classics