ఇంకెన్నాళ్ళు
ఇంకెన్నాళ్ళు
ఇంకెన్నాళ్ళూ..
ఇష్టం అని తెలిసినా దాచుంచటం..
దాచుకున్నానని చెప్పడానికి ఆగిపోవటం..
నడుస్తూ చూస్తుంటా అడుగుల దారిలో పట్టీల జతకై..
నిన్నే పిలుస్తూ మధ్యలో ఆగి నిన్నే చూస్తూండాలనే గడియకై..
తడుస్తున్న కనులను,
తచ్చాడుతున్న మనసును,
గుర్తుకొస్తున్న జ్ఞాపకాలనూ,
బాకీ ఉన్న ఊహలను..
ఒడిసిపట్టీ..
గడపకు జాగ్రత్త చెప్పీ..
ఒంటరిగా నిలుచున్నా..
పడవ ప్రయాణంలో నీతో పాటలినాలనీ..
కమ్ముకున్న చీకటికి నిన్ను చూపించి గెలిచాననీ చెప్పాలని...
