STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

ఈ రోజెంతో తీయనిది !

ఈ రోజెంతో తీయనిది !

1 min
435

మరపురానిది మనకెంతో ఈ రోజు ,

తీసుకొచ్చెను గొప్పగా ఆనందతీరాలకు .

నీకు నేనయ్యే , నాకు నీవయ్యే .

మరలిరానికాలమే మంచి తరుణమయ్యే !


విరబూసిన పూదోట మన వయసు ,

ఆ అందాలను ఆరాధించేది మనసు .

ఏనాటి వరమో ,

కనుల పండువగా ప్రేమపంటను చూశాము ,

ఒకేగూటి గువ్వలమయ్యాము .


ఒకరికొకరమై గడిపే ఈ సమయం

జీవితానికే మధుమాసం .

మళ్ళీమళ్ళీ వస్తే ఈ శుభఘడియలు ,

తెలియనైనా తెలియదు విరహము ,

మనల్ని వీడిపోని భావన మధురము .


ఎడారిలో కోయిల నేనైనా ,

మబ్బుతెరలే కమ్మే జాబిలి నీవైనా

మునుపిక మనకు

కేవలం ఆకాశంలోని చుక్కల మెరుపు ,

రంగులహరివిల్లే ఉయ్యాలకు ఊపు .

నిత్యకృత్యము ఎదురెదురుగా గడుపుట ,

మధురిమలే ఎడబాటుకు ఊరట !



Rate this content
Log in

Similar telugu poem from Thriller