STORYMIRROR

Midhun babu

Abstract Romance

4  

Midhun babu

Abstract Romance

ఇద్దరు

ఇద్దరు

1 min
220

దివినుంచి భువికేగి పుట్టారు ఇద్దరూ!

గోకులము వీధుల్లొ పెరిగారు ఇద్దరూ!


మదిలోన ప్రేమనే పెంచారు ఎన్నడూ 

క్షణమైన వదలకా తిరిగారు ఇద్దరూ!


వెన్ననే దాచింది కన్నయ్య కిష్టమని

పూదోట ఊయలన ఊగారు ఇద్దరూ!


రాధతో చెలిమినే తప్పుగా ఎంచారు

సత్యాన్ని చూపుచూ మెలిగారు ఇద్దరూ!


రాధయూ కృష్ణుడూ వేరేమీ కాదులే

ఆత్మలో యాత్మగా వెలిశారు ఇద్దరూ!


మురళితో పిలువగా నాట్యాన్ని చేసింది

ఒకరిలో ఒకరుగా తడిచారు ఇద్దరూ!


ప్రసన్నముగుంటారు చిలిపిగా ఆడుతూ

ఎవరేమియన్ననూ మరిచారు ఇద్దరూ!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract