STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

హృది లోనే

హృది లోనే

1 min
4


రోజుకెన్ని లేఖలనో..వ్రాస్తూనే పాడుకొందు..!

కాగితాలలో కాదులె..హృదిలోనే దాచుకొందు..!


నిను చూడగ ఆశపడే..మనసుదెంత వెర్రితనం..

నీ రూపం గాలిచేతి..గీతలలో చూసుకొందు..!


నాకుమటుకె వినిపించే..నీనవ్వుల మెఱుపులేవొ..

నీలిమేఘ మాలికలే..కోరుకోగ పంచుకొందు..!


వాడిపోని కృతజ్ఞతా..పారిజాత సుమమైతిని..

నీపదముల నిలిచిపోగ..మౌనముగా వేడుకొందు..!


నిజవసంత యామినులే..ప్రియురాళ్ళై పోయెనుగా..

చైత్రసుధను భావగగన..వీధులలో ఒంపుకొందు..!


నీవునేను ఏకమైన..సందడియే ఏకాంతము..

మరపుకింత మైమరపే..కలిగిస్తూ ఆడుకొందు.


Rate this content
Log in

Similar telugu poem from Romance