STORYMIRROR

Midhun babu

Action Classics Others

4  

Midhun babu

Action Classics Others

హోలీ

హోలీ

1 min
10

పండుగంటే తెలియని వాడు. 


వాడూ.. 

ఆకలీ దాహాలకు అతీతుడు.. 

అక్షరాల పరమాన్నం వడ్డించే పనిలోనే

నిమగ్నుడై వుంటాడు.! 

వాడి కనులకు మలగడమే తెలియదు..! 


ప్రేమగాయమై ఉన్నవాడు కదా

పెదవే విప్పని మౌనివర్యుడు కదా

వేలికొసల్లోంచి దూకే 

అక్షరాల అమృతపాతానికి బీజమైనవాడు కదా..! 


అక్షరప్రేమికుల గుండెచప్పుళ్ళకు

సాక్షియైన వాడు కదా

నిన్ను నిన్నుగా ప్రేమిస్తూ

నీ నుంచి ఏమీ ఆశించని

నిస్వార్థ స్నేహితుడు కదా..! 


వాడు నాలోపల

రోజూ అక్షరవాహినే అవుతుంటాడు. 

అక్షరాల ప్రేమవర్షంలో.. 

నన్ను ముంచెత్తుతుంటాడు. 

పండుగే అయి ఉన్నవాడు. 

పద్యమై ఎదలు మీటుతున్నవాడు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action