హితపు పలుకులు
హితపు పలుకులు
సప్తగిరులల్లే సంపదెంతున్నను
విశ్రాణనమును జేయు గుణము విత్తనమంతయిన యుండవలే
సింధువందు జలమెంతున్నను
ఉపలందు జేయు చెలమ తడారిన గొంతు తృష్ణను తీర్చుమల్లే
పల్కులెంత తేనెలూరినను
పరుషములుతో నొప్పించక పరుల మనుసును రంజింపచేయవలే
పదాల కూర్పేoత సుందరమున్నను
పాఠకుడి హృదిని కదిలించని కబ్బము ఎంత గొప్పదైన వ్యర్థంబులే
కూటి కొరకు నేర్చిన కోటి విద్యలైనను
జాతి మనుగడకై నీతి మార్గంబున నడిపించవలే
పెరుమాండ్లకు పేర్లు ఎన్నియున్నను
నిష్ఠతోని జూడ నీ మదిలోనే కొలువుండెనులే
దేవళములెన్ని దిరిగినను
కన్న వాళ్లే నీకు పుడమిన కనబడు దైవములులే
మొగిలి పువ్వల పొదలందు సర్పము రీతిన
చెడుగు చేరి మనిషికి తాకగా తత్త్వంబదేమిటో దెలియునులే
ఎప్పుడేమి జరుగునని భీతితో బతికినను
హద్దు మీరి గడుపంగా గడ్డుకాలమున గడియ గడవ వేల యుగంబులవునులే
మస్తిష్కమును నిత్యం తొలచు తలపేదైనను
అది ఆచరణలో అనువంత జూపినను అది చేయును అద్భుతంబులే
అంధకారము అలుముకున్నప్పుడేను
దెలియునుగా రవ్వంటి మిణుగురుల సొబగులే
నలుదిక్కుల్లో నలుపు నీ నడకను జూసి నవ్వినను
అడుగుల్లోన నీ ఆత్మవిశ్వాసంబే ఆయుధములే
ప్రయత్నంబున పరిహసంబులెన్నేదురైనను
పట్టించుకోక సాహిసి గుణమేప్పుడు సాధించిజూపుటేలే
క్షణకాలములందు కరి అంబుదములెన్ని కమ్మినను
పసిడి భానువులతో చెరిపి విశ్వమంతా ప్రభాకరుడు ప్రభవించునులే
ఫలితమాశించక ఆశల ఆశయంబు తోవన సాగిననను
అవరోధాల అంచున ఆఖరిఅడుగున నీకై గెలుపెదురు జూసేనులే
@హరాక్షర 3074@
