STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

గురువు

గురువు

1 min
7


ఓనమాలు దిద్దించే అక్షర బ్రహ్మ!

ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి ఈ జన్మ!

ఆ శిల్పి చేతిలో చెక్కిన బొమ్మలం,

బతుకు పుస్తకమంతా వారి ఆనవాళ్ళే !

జీవితాన్ని ముందుకు నడిపే రథసారథులే !

ప్రపంచాన్ని చూపించే యోధులే వారు


బలపం పట్టిన చేతుల్లో 

అక్షర దోషాలు దొర్లితే ఆ 

చేతులపై వాతలు పడతాయి

ఆ వాతలు పడ్డ చేతులను

నైపుణ్య సాధనాలుగా తీర్చిదిద్దగల

సమర్ధులు గురువర్యులు


ఓ గుప్పెడు ఆలోచనలు,మెదడున

కొన్ని అక్షర సుమాలు చేతిరాతలో

కదలాడుతున్నాయంటే ఆ అక్షరాల

మాంత్రికులు, ఆ ఆచార్యదేవులు 

నేర్పిన అక్షర కణికలే కారణం


యుగాలుగా నుండే కొనసాగే

గురుశిష్యులు అనుబంధం,

జ్ఞానదీపాలు వెలిగించడం

ఆ వెలుగులో మనం తరించడం

ఆ మహనీయుల ప్రియవచనాలు

నా మానస క్షేత్రమందు చెరగని

 తరగని ముద్రవేసాయి


Rate this content
Log in

Similar telugu poem from Classics