గుండె గది
గుండె గది
గుడి పెద్దగా ఉందనో...
లేక
మసీదు,చర్చి పెద్దగా ఉందనో...సంబరపడుతున్నావా?
గుండె గది ఎంత పెద్దగా ఉందో చూసుకున్నావా?..
ఎక్కడ చేయూతనిచ్చి,
సహాయం చేసే మనసు ఉంటుందో...
అక్కడే ఉంటాడు కదా ... ఆ పరమాత్మ...
అందుకే
ముందు గుండె గదిని చూడు ...
ఎంత ఇరుగ్గా ఉందో ...
ఎంత విశాలంగా ఉందో...
ఆయన అక్కడ లేకుంటే...
ఇంకెక్కడా వెతకకు... కనపడడు...
సంకుచిత విధానం తో
ఆయనకి మతాన్ని...ఆపాదించి ...
మతంలో వెతికితే కనపడతాడా?..
అండ,పిండ బ్రహ్మాండాలలో వెతకినా...
గర్వం తో విర్రవీగుతున్నా...
సంకర జాతి పనులు చేస్తున్నా...
ఆయనను చేరుకోగలవా?
మనసు గది తెరచినప్పుడు,
శ్వాసలో, ధ్యాసలో ఆయన్ని వెతికినప్పుడు...
తనువు, మనసు పులకరించదా...
అంతటి పరమాత్మ అయినా... కరుణించి...
ఆత్మసాక్షాత్కార భాగ్యాన్ని ప్రసాదించడా?
సహాయపడే గుణం నీదైనప్పుడు...
సంస్కారం నీలో కొలువుదీరినప్పుడు...
ధర్మ మార్గాన వెళుతున్నప్పుడు...
ఆయనే
అన్ని లోకాలను దాటుకుని...
నీకోసం వచ్చేయడా...?
