Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

గర్వభంగం

గర్వభంగం

1 min
294


నే వెలిగిస్తే వెలుగనుకున్నాను

నే పలికితే మంత్రమనుకున్నాను

నా స్వరమే శృతి అనుకున్నాను

నా ప్రతి నరమూ సంగీత తరంగమనుకున్నాను


నా చుట్టూ అహంకారమనే వలయం ఏర్పడింది

నే గమనించలేదు

నేను కావాలని తెచ్చుకోలేదు


శివా!

వద్దు. నాకొద్దు.

నీనుంచి నన్ను దూరం చేసే అహంకారం నాకొద్దు

గర్వభంగం జరిగిన తరువాత అర్థమయ్యింది


నీ దర్శనమే నాకు వెలుగు

నీ పేరే నే పలికే మంత్రం

నీ గుడి గంటల శబ్దమే నా శృతి

శివ భక్తుల పాద రేణువులే నాకు సంగీత తరంగాలు


ఇంకెప్పుడూ గర్వముతో ప్రవర్తించక

నిర్మలమైన భక్తితో నిను సేవించు భక్తినీయరా శ్రీకాళహస్తీశ్వరా!



Rate this content
Log in