గమ్యం
గమ్యం
బతుకు గతుకుల బాటతో
గమ్యం తెలియని దారితో
గత జ్ఞాపకాల గునపాలతో
గుండెబండ చేసిన బాధతో
బాధల కలగంప కూరలతో
బరువెక్కిన బాధ్యత విధితో
వేగలేని విషమ విషాదాలతో
విలయ విషాధ నిశి లయతో
సతమత సమస్యల సంచితో
స్పురలేని సంఘాల కుళ్ళుతో
మీనపు మోసాల భజనలతో
మైనపు మదిమదన మౌనతో
మైళ్ళ మైళ్ళు దాటి మెలకువతో
మనిషి నగిషిగా మరో రూపుతో...!!

