గమ్యం లేని ప్రయాణం
గమ్యం లేని ప్రయాణం
గమ్యం లేని ఈ పయనం
వెలుగులా గీతమై వినిపించాలి
తల్లి ఒడిలో ఆడినట్లు
తన్మయత్వం పొందాలి..!!
మనసునిండా రాగం పొర్లుతూ
వసంతంలా తనువు పండాలి
ఎద వీణలు మ్రోగుతూ
అక్షరం పలుకులు సాగాలి..!!
వ్యతిరేకత ఎంత ఉన్నా
జగడం వదిలివేయాలి
సరికొత్త దారుల్లో చూసుకుంటూ
పువ్వుల సువాసనలు వెదజల్లాలి..!!
చిన్న చిన్న ఆశలను
చిరు ప్రయత్నం తో మొదలెట్టి
చివరి గమ్యం వరకు
చింతలు లేకుండా వెళ్లాలి..!!
సమయానికి తగినట్లుగా
మాట తీరును మలిచి
ఉన్నతమైన వ్యక్తిత్వంతో
సంఘములో ప్రమిదలా వెలగాలి..!!
మంచి ఆలోచనే పరిమళం
పది మందిని తాకేందుకు సరళం
ప్రేమలోనే ఉంది మధురం
మనసు నిండా ఆత్మీయ అదే కదా..!!
