గమనము.. గమ్యము..
గమనము.. గమ్యము..
మరెందుకు అంత పట్టుదల
మళ్ళీ మారేందుకు వ్యథ
ఇంకొకరిని మాయ చేయాలనా
లేక కంటి తుడుపు చర్యనా
గమనము ఎటు వైపు వెళ్ళినా
గమ్యం చేరుతున్నా అనే ఆనందమా
అక్కర్లేని కీర్తి ప్రతిష్టలు
ఆశనిపాతాలై నిను చుట్టు మట్టి
ఆశల వలయంలో బంధించినట్లు
ఊపిరాడని ఈ పట్టణంలో
కిటికీల చాటున కర్టెన్
ఉన్నట్టు దాక్కుని ఇంకా ఉన్నా
నీకోసం కాదులే
నువ్వు రావని తెలుసులే
కాసుల కోసమే
తెలిసిపోయిందబ్బా
డబ్బుంటేనే అన్నీ అని
అన్నిట్లో డబ్బు చూస్తారని
ఇంకెందుకు పైపై మాటలు
అందుకే వదిలేసా ప్రేమ కథలు
