Srinivasa Bharathi

Drama

3  

Srinivasa Bharathi

Drama

గ్లోబల్ వార్మింగ్...

గ్లోబల్ వార్మింగ్...

1 min
266


మానుండి పుట్టినారూ-మీరు -మమ్మల్నే చంపుతారూ

ఇదేమి జన్మమంటా -మాకు- ఈ ఖర్మ మికేల నంటా

కోతిగా నే పుట్టితి .-ఆకలికి -కసరులే తిండిగానూ

ఎలకేనుగెలుగుబంటీ-లేడి,- పులి,మృగములెన్నైన గానీ

కుందేలు, నెమలి, కూడా- దొరికితే -మీరింక వదలబోరే

మాఇల్లుచ్చొచ్చిమీరూ..మమ్మల్ని-మీఇండ్లతరుముతారూ

                                                    ......"మానుండి""

రేపటికి ఆశలేదే-మేమేది- దోచింక దాచలేదూ

ఎన్ని మీకున్నగాని.. ఇంక...దోపిడీ వదలబోరూ

ఉచితముగా ఎన్నోచ్చినా.-మీ --కోర్కెలకు అడ్డులేదూ

కాసింత ఆహారము, -నిశ్చింత- మాజీవితం చూడగా

                                       ....... "              "మానుండి'"

నీరు, నేలా, గాలులు..మీదయతో --పనికిరానీ వయ్యెనూ

మీరింక మారబోరూ.-మా బ్రతుకు -మమ్మల్ని బ్రతకనీరూ

సునామీ వచ్చిందిగా..ప్లాస్టిక్స్ ..బ్రతుకంటే మీకిష్టమే

గ్లోబలూ వార్నింగులూ..ప్రకృతిని..పాతేసినారు మీరూ

                                                               "మానుండి"

ఇకనైన మేలుకొనరే..మీరింక..జాగర్త తీసుకోరే

కాలుష్యమును ఆపగా.. ఇకనైన..మొక్కల్ని పెంచరండి

మ్యూజియం ఇల్లైనది..మీదయతో.మాలోని కొందరికిని

తర్వాత మీవంతుగా..మార్పింక ....మీలోను రాకపోతే

                                 


Rate this content
Log in