ఘంటసాల
ఘంటసాల
శృతి లయల పర్ణశాల
వేల పాటల పూల మాల
కల కోకిల గాన హేల
సరి గమల ఘంటసాల !!
నీ గేయాలు మాన్పు గాయాలు
నీ రాగాలు మాన్పు రోగాలు
నీ బాణీలు మాకు వరాలు
నీ స్వరాలకు మాయం జ్వరాలు
నీ గాత్రంలో ఉంది ఆత్రం
నువ్వే సంగీతానికి నేత్రం
నువ్వే ఒక చిత్రం
నీ గళమే ఒక విచిత్రం !!
గాయకులూ ఎంతమందున్నా
నాయకుడవు నీవే అన్నా
ఖంగు మనే కంఠమున్న
నీకు వంగి వందనం చేస్తున్న !!
ఎన్నెన్నో అవార్డులు
మరెన్నో రివార్డులు
ఇంకెన్నో రికార్డులు !!
నీ పాటల తోటలలో
ఆ తేనెల ఊటలలో
పులకరించే నరం నరం
మునుగుతాము నిరంతరం
మురుస్తుంది ప్రతి తరం !!
మరలిరాని లోకాలకు తరలి పోయావా
మనసులలో నిలిచినా మహానుభావా
మరో జన్మ ఎత్తి మామ్మానందింపగ రావా !!
జోహారు జోహారు ఓ ఘంటసాల
నీ సాటి ఎవరురా మా ఘంటసాల !!