STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

గాయం-నూతన అధ్యాయానికి శ్రీకారం

గాయం-నూతన అధ్యాయానికి శ్రీకారం

1 min
364

అనుక్షణం కుంగదీసే బాధలు, 

అడుగడుగునా బాధించే అవరోధాలు, 

నిమిషం కూడా తీరిక ఇవ్వని ఆటంకాలు, 

పరిష్కారం దొరకని సమస్యల వలయాలు, 

ప్రతిక్షణం ఆందోళనలు, 

మనసును కష్టపెట్టే సన్నివేశాలు, 

అర్థం కాని ప్రశ్నలు, 

ఆలోచనకు చిక్కని విఘ్నాలు, 

సమాధానం వెతికేది ఎలా? 

ఆనందానుభూతిని పొందేది ఎలా? 

కారణాలను పసిగట్టేది ఎలా? 

నూతన అధ్యాయాలకు శ్రీకారం చుట్టేది ఎలా? 

ధైర్యం చూపదా నాకు నా మార్గం

ఆత్మవిశ్వాసం మాన్పదా నా గాయం

నా ఆలోచన కాదా నా ప్రశ్నకు సమాధానం


Rate this content
Log in

Similar telugu poem from Abstract