గాయం కధ
గాయం కధ
తన చూపుల ఆ గేయం..నిత్యమైన గాయం కద..!
పెను ఆశల నీడపైన..అందమైన గాయం కద..!
మనసుగూటి కోకిలమది..రగిలించెను మధురముగా..
తెలివిపైన వేటేసిన..చిత్రమైన గాయం కద..!
పదునుమీద అదను చూసి..దెబ్బతీసె ఏమందును..
ఏ మందుతొ పనేలేని..భాగ్యమైన గాయం కద..!
చదువలేని జీవితాన్ని..చదువగల్గు బలమిచ్చెను..
గుండెలయల నలరించే..హృద్యమైన గాయం కద..!
జాతకమే తిరగ వ్రాసి..కాల్చి రాశి పోసిందే..
ఖర్మలన్ని బూదిచేయు..దివ్యమైన గాయం కద..!

