STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

గాలి మర దగ్గర

గాలి మర దగ్గర

1 min
407

గురుతు లేదా నీకు

గురుత్వాకర్షణ కన్నా బలమైంది

నీ స్పర్శలో పొందే మత్తు అని


కలలను కాళ్ళతో తన్ని

నిన్ను పొందే ఆశతో

అదే గొప్పనే ధ్యాసలో

సర్వం విడిచి ఒంటరినైనాను


అదే గాలి మర దగ్గర

నిన్ను మొదట కలిసింది

మనసు తెలిపింది

మెల్లిగా దగ్గరైంది


అదంతా గతం నీకు

నాకేమో అదే భవిష్యత్తు దారి

ఎలా మరువడం

మరిచి నిన్ను తాకడం


గాలి మర తిరుగుతోంది

నా తలలా

వేగంగా తిరుగుతోంది

మెలకువ వస్తే ఒక్కటి జ్ఞాపకం చేసుకో


నే నీతో ఉన్నా

ఉంటా..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract